Jani Master: రామ్‌ చరణ్‌ దంపతుల మాటతో నా సంతోషం వెయ్యి రెట్లు పెరిగింది: జానీ మాస్టర్‌

రామ్‌ చరణ్‌ దంపతులు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. డ్యాన్స్‌ర్స్‌ యూనియన్‌లోని కుటుంబాలకు సాయం చేయనున్నారు.

Updated : 03 Jul 2024 17:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్ చరణ్‌ దంపతులు ఇచ్చిన మాటతో తన సంతోషం వెయ్యి రెట్లైందన్నారు ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌. డ్యాన్సర్స్‌ యూనియన్‌లోని కుటుంబాలకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విషయంలో సాయం చేస్తామని మాటిచ్చినట్లు తెలిపారు. దీనిపై ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

‘సరైన సమయంలో సహాయం చేస్తే దేవుడు అంటారు. నా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ (Ram Charan) అన్న వాళ్ల ఇంటికి పిలిచారు. వారికి నా మీదున్న ప్రేమకు చాలా సంతోషించా. అక్కడికి వెళ్లాక చిరంజీవి (Chiranjeevi) ఆశీర్వాదంతో పాటు చరణ్ అన్న, ఉపాసన వదిన ఇచ్చిన మాటకు నా సంతోషం వెయ్యి రెట్లు పెరిగింది. నేను గతంలో అడిగిన సాయాన్ని గుర్తుంచుకున్నారు. మా డ్యాన్సర్స్‌ యూనియన్‌లో ఉన్న 500లకు పైగా కుటుంబాలకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అందేలా అండగా ఉంటామన్నారు. అడిగిన సాయాన్ని గుర్తుంచుకొని.. ఇచ్చిన మాటకి విలువనిస్తూ.. అన్ని కుటుంబాలను చేరదీయడం సామాన్యమైన విషయం కాదు. మా అందరి మనసులు కృతజ్ఞతతో నిండిపోయాయి. మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా’ అని రాసుకొచ్చారు. రామ్‌ చరణ్‌ దంపతులతో దిగిన ఫొటోను జానీ మాస్టర్‌ షేర్‌ చేశారు. దీంతో రామ్ చరణ్‌ దంపతుల మంచి మనసుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ ఏడాది ప్రయోగాత్మక చిత్రాలు.. ఏ సినిమా ఏ ఓటీటీలో?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని