J D Chakravarthy: విష్ణుప్రియతో వివాహం.. క్లారిటీ ఇచ్చిన జేడీ చక్రవర్తి

తనని ఉద్దేశిస్తూ యాంకర్‌ విష్ణుప్రియ (Vishnu priya) ఇటీవల చేసిన కామెంట్స్‌పై నటుడు జేడీ చక్రవర్తి స్పందించారు.

Updated : 18 Jun 2023 05:31 IST

హైదరాబాద్‌: తాను జేడీ చక్రవర్తి (J D Chakravarthy)ని ఇష్టపడుతున్నానని ఛాన్స్‌ వస్తే ఆయన్ని వివాహం చేసుకుంటానంటూ ఇటీవల యాంకర్‌ విష్ణుప్రియ (Vishnu Priya) వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై జేడీ చక్రవర్తి స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన విష్ణుప్రియ అలా చెప్పడానికి గల కారణాన్ని వెల్లడించారు. తమ మధ్య మంచి అనుబంధం ఉందని, అది ప్రేమకాదని చెప్పారు.

‘‘విష్ణుప్రియ ఎంతో మంచి అమ్మాయి. మేమిద్దరం కలిసి ఇటీవల ఓ సిరీస్‌లో నటించాం. అది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సిరీస్‌ కోసం దాదాపు 40 రోజులు కలిసి వర్క్‌ చేశాం. ఆ సిరీస్‌ దర్శకుడు పవన్‌ సాధినేని ఓసారి విష్ణుప్రియకు చిన్న సలహా ఇచ్చాడు. అదేమిటంటే.. ప్రతిరోజూ నేను నటించిన ఒక సినిమా చూడమని చెప్పాడు. అలా, నేను నటించిన సినిమాలన్నీ చూసి ఆయా చిత్రాల్లోని పాత్రలతో ఆమె ప్రేమలో పడ్డారు. అంతే తప్ప ఆమె నన్ను ప్రేమించలేదు. మా మధ్య గురు శిష్యుల అనుబంధమే ఉంది. చాలా తక్కువగా మాట్లాడుకుంటాం’’ అని ఆయన తెలిపారు. ఇక, కొన్ని నెలల క్రితం ఓ సెలబ్రిటీ గేమ్‌ షోలో పాల్గొన్న విష్ణుప్రియ.. తనకి జేడీ చక్రవర్తి అంటే ఇష్టమని, ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పారు. అంతేకాకుండా జేడీ చక్రవర్తి వాళ్లమ్మ అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటానని అన్నారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని