Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’పై రూమర్.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన హరీశ్‌ శంకర్

‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’ ఆగిపోనుందని ఎక్స్‌లో వచ్చిన పోస్ట్‌కు హరీశ్ శంకర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

Published : 05 Jul 2024 13:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) - హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’. ‘గబ్బర్‌సింగ్‌’ లాంటి సూపర్‌ హిట్‌ సినిమా తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో దీనికి సంబంధించిన ఏ వార్త అయినా వైరల్‌ అవుతోంది. తాజాగా దీనిపై ఓ రూమర్‌ రావడంతో హరీశ్ శంకర్‌ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

తన సినిమా అప్‌డేట్‌లను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో పాటు అభిమానులకు రిప్లయ్‌ ఇస్తూ వారికి ఎప్పుడూ టచ్‌లో ఉంటారు దర్శకుడు హరీశ్ శంకర్‌. అయితే, ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh) ఆగిపోనుందంటూ ఎక్స్‌లో ఒకరు పోస్ట్‌ చేయగా వారికి స్ట్రాంగ్‌ రిప్లయ్‌ ఇచ్చారు. ‘సినిమా మొదలేకాదు అని రూమర్స్‌ వచ్చినప్పుడే పట్టించుకోలేదు. ఇప్పుడు ఇలాంటి వాటి గురించి చదివే సమయం కూడా లేదు’ అని అన్నారు. ఈ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని హరీశ్ శంకర్‌ గతంలోనే చెప్పారు. ఇందులో పవన్‌ కల్యాణ్ ఎప్పటిలాగే పవర్‌ఫుల్‌గా కనిపిస్తారని పేర్కొన్నారు. ఇందులో పవన్‌ సరసన శ్రీలీల నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్‌పై స్పందించిన నాగ్‌ అశ్విన్‌

మీరు మర్చిపోయినవన్నీ గుర్తుచేస్తా: హరీశ్‌ శంకర్

హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ (mr bachchan). భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలోని పాట టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. దానిపై హరీశ్ పోస్ట్‌ పెడుతూ.. ‘మీరు మర్చిపోయినవన్నీ గుర్తుచేస్తా.. మీకు గుర్తున్నవన్నీ మళ్లీ చూపిస్తా..’ అని రాసుకొచ్చారు. ఈ టీజర్‌లో 90 దశకంలో ఎక్కువగా ఉపయోగించినవి చూపించారు. అప్పట్లో టీవీలో వచ్చే చిత్రలహరి, మహాభారతం ఇమేజ్‌లు ఈ టీజర్‌లో కనిపించాయి. వీటిని ఉద్దేశించే హరీశ్ ఈ కామెంట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని