Prabhas: ఆ సాంగ్‌ వచ్చే టైమ్‌కు థియేటర్‌కు పంపాడు.. ప్రభాస్‌పై హంస నందిని కామెంట్స్‌

ప్రభాస్‌కు బిడియం ఎక్కువని హంసనందిని అన్నారు. ‘మిర్చి’ రోజులను గుర్తుచేసుకున్నారు.

Updated : 02 Jul 2024 17:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ కెరీర్‌లో ఉత్తమ చిత్రాల్లో ‘మిర్చి’ ఒకటి. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో ట్రెండ్ సృష్టించాయి. ముఖ్యంగా హంస నందిని, ప్రభాస్‌ల ‘మిర్చిమిర్చిలాంటి కుర్రాడే..’ పాట ఉర్రూతలూగించింది. ఆ సినిమా విడుదలైనప్పటి ఓ సంఘటనను హంస నందిని తాజాగా గుర్తుచేసుకున్నారు. ప్రభాస్‌కు (Prabhas) బిడియం ఎక్కువ అని చెప్పారు.

ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో మూవీస్‌ చూడాలనుకుంటున్నారా?ఇవి బెస్ట్‌ ఛాయిస్‌..!

‘‘మిర్చి’ విడుదలైన సమయంలో బిజీగా ఉన్నాను. దీంతో సినిమా చూడడం కుదరలేదు. ఒకరోజు ప్రభాస్‌ను కలిసినప్పుడు ‘సినిమా చూశావా. మన సాంగ్ సూపర్‌ హిట్ అయ్యింది’ అన్నారు. చూడలేదని చెప్పడంతో.. వెంటనే టికెట్‌ బుక్ చేసి.. సాంగ్‌ వచ్చే టైమ్‌ చెప్పారు. ఆ సమయానికి థియేటర్‌కు వెళ్లాను. ఆడియన్స్ ఆ పాటను ఎంజాయ్‌ చేయడం చూసి ఆనందించా. మూవీ మొత్తం చూసి వచ్చాను. నేను నటించిన సినిమాల్లోని పాటలు మంచి గుర్తింపు పొందాయి. ఇప్పటికీ కొందరి రింగ్‌టోన్లుగా పెట్టుకుంటున్నారు’ అని హంస నందిని ఆనందం వ్యక్తం చేశారు.

ప్రభాస్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘మిర్చి’ సూపర్ హిట్‌గా నిలిచి మంచి వసూళ్లు సాధించింది. 2013లో విడుదలైన ఈ చిత్రం యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ‘జై’గా ప్రభాస్‌, వెన్నెల పాత్రలో అనుష్క వారి నటనతో ఫిదా చేశారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్తమ చిత్రంగా 2013లో నందితో పాటు మరికొన్ని అవార్డులు అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు