Tollywood: రెండు కొత్త చిత్రాల షూటింగ్‌ షురూ.. అవేంటంటే!

‘యుఫోరియా’ (Euphoria) షూటింగ్‌ను గుణశేఖర్‌ ప్రారంభించారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ మరో చిత్రాన్ని మొదలుపెట్టారు.

Published : 01 Jul 2024 13:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టాలీవుడ్‌ ప్రస్తుతం ‘కల్కి’ రిలీజ్‌తో కళకళలాడుతోంది. ఇక ఈరోజు మరో రెండు సినిమాల షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. దీంతో సినీప్రియులు సంబరపడుతున్నారు. కొత్త కాన్సెప్ట్‌తో గుణశేఖర్‌ ‘యుఫోరియా’ (Euphoria) షూటింగ్‌ మొదలుపెట్టారు.

ఎన్నో గొప్ప సినిమాలతో వినోదాన్ని పంచిన గుణశేఖర్‌ (Gunasekhar).. చివరిసారి ‘శాకుంతలం’తో ప్రేక్షకులను పలకరించారు. దీనితర్వాత కొన్ని నెలలు విరామం తీసుకున్న ఆయన ఇటీవల ‘యుఫోరియా’ను ప్రకటించారు. నేడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నీలిమా గుణశేఖర్‌ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ చిత్రంతో గుణశేఖర్‌ మరోసారి తన మార్క్‌ చూపించనున్నారంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

‘కల్కి’లాంటి సినిమాలు చాలా అరుదు.. ఆడియన్స్‌కు థ్యాంక్స్‌ చెప్పిన నాగ్‌ అశ్విన్‌

‘టైసన్‌ నాయుడు’ (Tyson Naidu)తో బిజీగా ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas) మరో చిత్రాన్ని ప్రకటించారు. #BSS11గా ఇది తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్‌ను నేడు ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫొటోలను నిర్మాణసంస్థ పంచుకుంది. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్‌ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. హారర్‌ మిస్టరీ కథాంశంతో ఇది రూపొందనుంది. ఇందులో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్‌ కనిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని