God Father: అనుకున్న సమయానికే..

వెనకడుగు వేసేదే లేదంటోంది ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్ర బృందం. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. మలయాళంలో విజయవంతమైన ‘లూసీఫర్‌’కు రీమేక్‌గా రూపొందుతోంది. మోహన్‌ రాజా తెరకెక్కిస్తున్నారు.

Updated : 08 Sep 2022 06:51 IST

వెనకడుగు వేసేదే లేదంటోంది ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father) చిత్ర బృందం. చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. మలయాళంలో విజయవంతమైన ‘లూసీఫర్‌’కు రీమేక్‌గా రూపొందుతోంది. మోహన్‌ రాజా తెరకెక్కిస్తున్నారు. ఎన్వీ ప్రసాద్‌, ఆర్బీ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబరు 5న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించింది. అయితే ఈ సినిమా వాయిదా పడనుందని.. నిర్మాణాంతర పనులు పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశముందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే విడుదల తేదీపై చిత్ర నిర్మాతలు మరోసారి స్పష్టత ఇచ్చారు. ‘‘ఎలాంటి ఊహాగానాలు నమ్మొద్దు. ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రం అక్టోబరు 5నే ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. త్వరలో ప్రచార కార్యక్రమాల్ని ప్రారంభిస్తున్నాం’’ అని నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ తెలిపారు. ఈ సినిమా తొలి లిరికల్‌ గీతం వచ్చే వారం విడుదల కానుందని సమాచారం. ఈ సినిమాలో సత్యదేవ్‌, నయనతార, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీత దర్శకుడిగా.. నీరవ్‌ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని