‘అరి’షడ్వర్గాల నేపథ్యంలో...

పురాణాలు... ఇతిహాసాల నేపథ్యంలో విరివిగా సినిమాలు రూపొందుతున్నాయి. ఆ ట్రెండ్‌ కొనసాగుతున్న క్రమంలోనే అరిషడ్వర్గాల నేపథ్యం, శ్రీకృష్ణుడి గొప్పతనం ప్రధానంగా రూపొందిన ‘అరి’ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

Published : 05 Jul 2024 01:20 IST

పురాణాలు... ఇతిహాసాల నేపథ్యంలో విరివిగా సినిమాలు రూపొందుతున్నాయి. ఆ ట్రెండ్‌ కొనసాగుతున్న క్రమంలోనే అరిషడ్వర్గాల నేపథ్యం, శ్రీకృష్ణుడి గొప్పతనం ప్రధానంగా రూపొందిన ‘అరి’ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. వినోద్‌ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రమిది. జయశంకర్‌ దర్శకుడు. శ్రీనివాస్‌ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మాతలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తుది దశ నిర్మాణానంతర పనుల్లో ఉంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామ్యంలో త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. ‘‘భారతీయ తెరపై ఇప్పటివరకూ చూడని ఓ విభిన్నమైన కథ ఇది. మన పురాణాల నేపథ్యం ఈ చిత్రానికి ప్రధాన బలం. ప్రతి పాత్రా గుర్తుండిపోతుంది. ఈ చిత్రం హిందీ రీమేక్‌ కోసం కూడా సన్నాహాలు చేస్తున్నామ’’ని చిత్రవర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు