టాక్సిక్‌ కోసం 1950 కాలంలోకి!

యశ్‌ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్‌’. ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌.. అన్నది ఉపశీర్షిక. కేవీఎన్‌ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Published : 03 Jul 2024 00:57 IST

శ్‌ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్‌’. ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌.. అన్నది ఉపశీర్షిక. కేవీఎన్‌ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కియారా కథానాయికగా నటిస్తుండగా.. నయనతార, హుమా ఖురేషీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు తెలిసింది. ఇది డ్రగ్‌ మాఫియా కథాంశంతో తెరకెక్కనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు దీని నేపథ్యం గురించి మరో ఆసక్తికర అంశం బయటకొచ్చింది. ఈ సినిమా 1950 - 1970ల మధ్య కాలంలో జరిగే కథగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం బెంగళూరు శివార్లలో అప్పటి వాతావరణాన్ని తలపించేలా కొన్ని సెట్లు నిర్మించినట్లు తెలిసింది. అందులోనే ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ చిత్రీకరణ లండన్‌లో  జరగనుంది. దీనికి చరణ్‌రాజ్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని