‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌2’కి జోడీగా మృణాల్‌..?

‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌’తో నవ్వులు పంచిన అజయ్‌ దేవగణ్, సంజయ్‌ దత్‌లు దాని సీక్వెల్‌ ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌2’ కి సిద్ధమవుతున్నారు. ఇందులో కూడా వాళ్లు జస్సీ సింగ్, బిల్లు సింగ్‌లుగా కనిపించనున్నారు.

Published : 03 Jul 2024 00:55 IST

న్‌ ఆఫ్‌ సర్దార్‌’తో నవ్వులు పంచిన అజయ్‌ దేవగణ్, సంజయ్‌ దత్‌లు దాని సీక్వెల్‌ ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌2’ కి సిద్ధమవుతున్నారు. ఇందులో కూడా వాళ్లు జస్సీ సింగ్, బిల్లు సింగ్‌లుగా కనిపించనున్నారు. అయితే తొలి భాగానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. వీరిద్దరి మధ్య పోటీ మరింత తీవ్రంగా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేలా ఉంటుందట. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కొత్త సంగతి తెలిసింది. ఇటీవలే ‘కల్కి’లో తళుక్కున మెరిసి, ప్రశంసలు అందుకుంటోన్న అందాల తార మృణాల్‌ ఠాకూర్‌ని ఇందులో కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. ‘ఈ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటించడానికి మృణాల్‌ చాలా ఉత్సాహంగా ఉంది. ఈనెల ఆఖర్లో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మృణాల్, అజయ్‌ల మధ్య వచ్చే రొమాంటిక్‌ పాటలు, సన్నివేశాలను స్కాట్లాండ్‌లో చిత్రీకరించనున్నాం. వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడిస్తాం’ అని సన్నిహితవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ‘దే దే ప్యార్‌ దే 2’తో బిజీగా ఉన్నారు అజయ్‌ దేవగణ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని