హాలీవుడ్‌లో కిల్‌!

దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో.. నిఖిల్‌ నగేశ్‌ భట్‌ తెరకెక్కించిన చిత్రం ‘కిల్‌’. లక్ష్య కథానాయకుడు. రాఘవ్‌ జుయిల్, ఆశిష్‌ విద్యార్థి, తాన్యా మాణిక్తల ఇతర కీలక పాత్రలు పోషించారు.

Published : 03 Jul 2024 00:51 IST

ర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో.. నిఖిల్‌ నగేశ్‌ భట్‌ తెరకెక్కించిన చిత్రం ‘కిల్‌’. లక్ష్య కథానాయకుడు. రాఘవ్‌ జుయిల్, ఆశిష్‌ విద్యార్థి, తాన్యా మాణిక్తల ఇతర కీలక పాత్రలు పోషించారు. టొరంటో, ట్రిబెకాతో సహా పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని హాలీవుడ్‌లో రీమేక్‌ చేయనున్నట్టు తాజా సమాచారం. ‘జాన్‌ విక్‌’ ఫ్రాంచైజీలతో అభిమానులను ఆకట్టుకున్న నిర్మాణ సంస్థలు 87 లెవెన్‌ ఎంటర్‌టైన్‌మెంట్, లయన్స్‌గేట్‌ సంయుక్తంగా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఆర్మీ కమాండో అయిన అమ్రిత్‌ తన ప్రియురాలు తులికాను కాపాడేందుకు ప్రత్యర్థులతో రైలులో చేసిన యాక్షన్‌ కథనంతో ఈ సినిమా తెరకెక్కింది. భారతీయ తెరపై మునుపెన్నడూ చూడని యాక్షన్‌ సన్నివేశాలు ‘కిల్‌’లో ఉంటాయని దర్శకుడు తెలిపారు. చిత్రం విడుదల కాకుండానే హాలీవుడ్‌లో రీమేక్‌కి ఎంపికవడం భారతీయ సినిమాకు ఓ మైలురాయి అని సన్నిహితవర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని