బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా ‘గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్‌’

‘గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్‌’ చిత్రం విశ్వవేదికపై మరోసారి సత్తా చాటింది. లాస్‌ ఏంజెలిస్‌లో జరిగిన భారతీయ చలన చిత్రోత్సవాల్లో బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా నిలిచి, గ్రాండ్‌ జ్యూరీ ప్రైజ్‌ అందుకుంది.

Published : 03 Jul 2024 00:49 IST

ర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్‌’ చిత్రం విశ్వవేదికపై మరోసారి సత్తా చాటింది. లాస్‌ ఏంజెలిస్‌లో జరిగిన భారతీయ చలన చిత్రోత్సవాల్లో బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా నిలిచి, గ్రాండ్‌ జ్యూరీ ప్రైజ్‌ అందుకుంది. బాలీవుడ్‌ సినీ జంట రిచా చద్ధా, అలీ ఫజల్‌లు తమ పుషింగ్‌ బటన్స్‌ పతాకంపై ఈ సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే. సుచీ తలాటీ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రిచా స్పందిస్తూ.. ‘‘గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్‌’ చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి మాకు అద్భుతమైన బహుమతుల్ని అందిస్తూనే ఉంది. అది మాకెంతో గర్వకారణం. గ్రాండ్‌ జ్యూరీ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది. ఈ సినిమా దర్శకురాలు సుచీ భిన్నమైన కథనాలను ప్రేక్షకులకు అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మేమందరం భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. మనుషుల మధ్య ఉండే అనుబంధాలు, భావోద్వేగాల గురించి కథలుగా చెప్పాలనుకుంటున్నాం’ అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చింది. ఇందులోని ప్రీతి పాణిగ్రాహి, ఇతర నటీనటుల నటనను ప్రశంసించింది రిచా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని