శ్రీలంకలో యాక్షన్‌ మొదలు

‘కల్కి 2898ఎ.డి’ చిత్రంలో అర్జునుడి పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఆయన హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

Published : 02 Jul 2024 01:15 IST

ల్కి 2898ఎ.డి’ చిత్రంలో అర్జునుడి పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఆయన హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సత్యదేవ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే వైజాగ్‌లో ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు కొత్త షెడ్యూల్‌ను శ్రీలంకలో ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నారు. దాదాపు 40రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ షెడ్యూల్‌ వచ్చే వారంలో మొదలు కానుంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా విజయ్‌పై భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ఆగస్టు చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలన్న లక్ష్యంతో చిత్ర బృందం ఉంది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి అనిరుధ్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని