మళ్లీ అలాంటి అవకాశం రాలేదు

‘‘వైఫల్యాలే మీ గురువులు, స్నేహితులు, మార్గదర్శకులు’’ అంటున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు ఆయుష్మాన్‌ ఖురానా.

Updated : 02 Jul 2024 01:28 IST

‘వైఫల్యాలే మీ గురువులు, స్నేహితులు, మార్గదర్శకులు’’ అంటున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు ఆయుష్మాన్‌ ఖురానా. గతేడాది ‘డ్రీమ్‌ గర్ల్‌2’తో ప్రేక్షకులను పలకరించిన ఆయన.. ఇప్పటి వరకు తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించలేదు. తాజాగా ఆయన తన కెరీర్‌ను మలుపు తిప్పడానికి ‘దమ్‌ లగా కే హైషా’ కీలక పాత్ర పోషించిందని చెప్పాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయుష్మాన్‌.. తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘‘పరాజయాలను ఎదుర్కోగల సామర్థ్యం ఉన్నవాళ్లు మాత్రమే నిజమైన నటుడని నా అభిప్రాయం. విజయం నా దృష్టిలో చాలా చెడ్డది. మీరు ఎదుర్కొన్న వైఫల్యాలే మీకు స్నేహితులు, తత్వవేత్తలు. ప్రారంభ రోజుల్లోనే కష్టనష్టాలు అనుభవించకపోతే.. భవిష్యత్తులో వాటిని అధిగమించడం కష్టం అవుతుంద’’ని అన్నాడు. ‘‘నా మొదటి సినిమా ‘విక్కీ డోనర్‌’ తర్వాత వరుసగా పరాజయాలే అందుకున్నాను. ఈ చిత్రంతో పరిశ్రమలో ఒక బెంచ్‌మార్క్‌ను సెట్‌ చేసుకున్న నాకు.. మళ్లీ ఎలాంటి అవకాశాలు రాలేదు. 2015లో ‘దమ్‌ లగా కే హైషా’ సినిమా హిట్‌తో నా ప్రయాణం మళ్లీ మొదలైంది. కాబట్టి ఒక నటుడిగా కాకుండా.. ప్రేక్షకులకు దగ్గరగా ఉండే కథలను, పాత్రలను ఎంచుకోవాలి’’ అని చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని