ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ప్రభుదేవా

సినిమాల్లో తన నటనతోనే కాకుండా.. అదిరిపోయే స్టెప్పులతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తుంటారు కథానాయకుడు ప్రభుదేవా.

Updated : 02 Jul 2024 01:27 IST

సినిమాల్లో తన నటనతోనే కాకుండా.. అదిరిపోయే స్టెప్పులతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తుంటారు కథానాయకుడు ప్రభుదేవా. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న ఆయన.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. జేఎమ్‌ రాజా తెరకెక్కిస్తున్న ‘సింగనల్లూర్‌ సిగ్నల్‌’ అనే చిత్రంలో ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటిస్తూ.. సామాజిక మాధ్యమాల వేదికగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా సరికొత్త పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ప్రభుదేవా. ఈ చిత్రంలో ఆయన సరసన ‘జో’ ఫేమ్‌ భవ్య త్రిఖ నటిస్తుంది. ఏజే ప్రభాకరన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని