సుధా కొంగర దర్శకత్వంలో ధనుష్‌?

‘సర్ఫిరా’ సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు దర్శకురాలు సుధా కొంగర. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన ఈ చిత్రం సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’కు రీమేక్‌గా రూపొందింది.

Published : 01 Jul 2024 00:56 IST

ర్ఫిరా’ సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు దర్శకురాలు సుధా కొంగర. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన ఈ చిత్రం సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’కు రీమేక్‌గా రూపొందింది. ఇది జులై 12న విడుదల కానుండగా.. దీని తర్వాత సుధా చేయనున్న చిత్రమేదన్నది ఇంకా స్పష్టత రాలేదు. సూర్యతో ‘పురాణనూరు’ అనే చిత్రం చేయనున్నట్లు ఆ మధ్య ప్రకటన వచ్చినా అది అనుకోని కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. అయితే ప్రస్తుతం కోలీవుడ్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సుధా తదుపరి సినిమా ధనుష్‌తో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై సంప్రదింపులు మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సూర్యతో చేయాల్సిన కథనే ధనుష్‌తో చేసే అవకాశమున్నట్లు ప్రచారం బలంగా వినిపిస్తోంది. ‘సర్ఫిరా’ విడుదల తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. ధనుష్‌ ప్రస్తుతం ‘రాయన్‌’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ చిత్రంలో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని