నటికి ఇంతకన్నా ఏం కావాలి?

‘‘అభిమానులు నా పని గురించే మాట్లాడాలనేది నాకు ఎప్పట్నుంచో ఉన్న కోరిక’’ అని అంటోంది అందాల తార త్రిప్తి దిమ్రీ. ‘యానిమల్‌’తో హిట్‌ అందుకున్న ఈ భామ..త్వరలో ‘బ్యాడ్‌ న్యూజ్‌’ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌తో రావడానికి ముస్తాబవుతోంది.

Published : 01 Jul 2024 00:54 IST

‘‘భిమానులు నా పని గురించే మాట్లాడాలనేది నాకు ఎప్పట్నుంచో ఉన్న కోరిక’’ అని అంటోంది అందాల తార త్రిప్తి దిమ్రీ. ‘యానిమల్‌’తో హిట్‌ అందుకున్న ఈ భామ..త్వరలో ‘బ్యాడ్‌ న్యూజ్‌’ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌తో రావడానికి ముస్తాబవుతోంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నా కెరీర్‌లో నేను చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇంతక ముందు చేసిన ప్రాజెక్టుల కన్నా.. ఇటీవల విడుదలైన సినిమాల వల్లే అభిమానుల నుంచి చాలా ప్రేమను పొందుతున్నాను. ప్రజలు నా పనిని ఇష్టపడుతున్నారు. దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదే నాకు ముఖ్యం. ప్రేక్షకులు ఎప్పుడూ నా పని గురించే మాట్లాడాలని నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడే నిర్ణయించుకున్నాను. నటీనటుల జీవితంలో మరింత మెరుగ్గా ఉండేందుకు.. నిరంతరం పనిచేస్తూనే ఉండడానికి ఈ మాటలు మనల్ని ప్రేరేపిస్తాయనేది నా అభిప్రాయం. అదృష్టవశాత్తు ఇప్పుడదే జరుగుతోంది. ఇంతకంటే ఒక నటికి ఏం కావాలి’’ అని చెప్పుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని