‘బెంజ్‌’లోకి ఈ ఇద్దరూ!

‘ఖైదీ’, ‘విక్రమ్‌’ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. ఇప్పుడాయన కథతో ‘రెమో’ ఫేమ్‌ భాగ్యరాజ్‌ కన్నన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బెంజ్‌’.

Published : 30 Jun 2024 01:10 IST

‘ఖైదీ’, ‘విక్రమ్‌’ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. ఇప్పుడాయన కథతో ‘రెమో’ ఫేమ్‌ భాగ్యరాజ్‌ కన్నన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బెంజ్‌’. రాఘవ లారెన్స్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ చిత్రంలోని మిగిలిన ప్రధాన తారాగణాన్ని ఖరారు చేసే పనిలో పడింది చిత్ర బృందం. ఇందులో భాగంగా దీంట్లో ప్రతినాయకుడిగా ఫహాద్‌ ఫాజిల్‌ను.. మరో ముఖ్య పాత్ర కోసం ఎస్‌.జె.సూర్యను ఎంపిక చేసినట్లు సమాచారం. సూర్య ఇటీవలే లారెన్స్‌తో ‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’లో సందడి చేయగా.. ఫహాద్‌కు మాత్రం ఆయనతో ఇదే తొలి సినిమా. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని