మిగిలింది ఒక్కటే!

ఈ ద్వితీయార్ధంలో వస్తున్న కీలకమైన సినిమాల విడుదల తేదీలు దాదాపు ఖరారైపోయాయి. తమిళం నుంచి వస్తున్న ‘కంగువా’ కూడా అక్టోబరు 10వ తేదీని ఖాయం చేసుకుంది.

Published : 29 Jun 2024 01:12 IST

ద్వితీయార్ధంలో వస్తున్న కీలకమైన సినిమాల విడుదల తేదీలు దాదాపు ఖరారైపోయాయి. తమిళం నుంచి వస్తున్న ‘కంగువా’ కూడా అక్టోబరు 10వ తేదీని ఖాయం చేసుకుంది. ఇక ఇప్పుడందరి దృష్టి రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’పైనే ఉంది. ఖరారు కావల్సిన భారీ సినిమా అంటే అదొక్కటే. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా... శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుంది. దర్శకుడు శంకర్‌ ప్రస్తుతం ‘భారతీయుడు 2’ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయన ఈ సినిమాని, ‘గేమ్‌ ఛేంజర్‌’ని సమాంతరంగా తెరకెక్కించారు. వచ్చే నెల 12న ‘భారతీయుడు 2’ విడుదలకు సిద్ధమైంది. ఆ చిత్రం విడుదల తర్వాతే ‘గేమ్‌ ఛేంజర్‌’ ఎప్పుడొస్తుందనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్రణాళికలతో సినీ వర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని