మిలియన్‌ కాదు... బిలియన్‌ నవ్వుల కోసం సిద్ధమేనా!

‘‘బరేలీ కీ బర్ఫీ’ సినిమాలో చివరికి ఆయుష్మాన్‌కి కృతిని ఇచ్చేసే రాజ్‌కుమార్‌ రావ్‌ని కాదు నేను’’ అంటూ తన ప్రియురాలిని దక్కించుకోవడానికి తపిస్తున్నాడు విక్కీ కౌశల్‌. మరి ఆయన కథేంటనేది తెలుసుకోవాలంటే ‘బ్యాడ్‌ న్యూజ్‌’ చూడాల్సిందే.

Published : 29 Jun 2024 01:04 IST

‘‘రేలీ కీ బర్ఫీ’ సినిమాలో చివరికి ఆయుష్మాన్‌కి కృతిని ఇచ్చేసే రాజ్‌కుమార్‌ రావ్‌ని కాదు నేను’’ అంటూ తన ప్రియురాలిని దక్కించుకోవడానికి తపిస్తున్నాడు విక్కీ కౌశల్‌. మరి ఆయన కథేంటనేది తెలుసుకోవాలంటే ‘బ్యాడ్‌ న్యూజ్‌’ చూడాల్సిందే. ఆయన, త్రిప్తి దిమ్రీ, అమీ విర్క్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ఆనంద్‌ తివారీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఇన్‌స్టా వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. ‘ఒక మిలియన్‌ కాదు.. బిలియన్‌ నవ్వుల కోసం సిద్ధమేనా..? ‘బ్యాడ్‌న్యూజ్‌’ ట్రైలర్‌ను అందిస్తున్నామ’ని వ్యాఖ్యల్ని జోడించింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవాలని త్రిప్తి చేస్తున్న ప్రయత్నాలు.. దాని కోసం విక్కీ, అమీ విర్క్‌ ఎదుర్కొంటున్న పరిస్థితులను చూపిస్తూ ఆద్యంతం ఆసక్తిగా సాగుతోందీ ట్రైలర్‌. ‘మన్మర్జియాన్‌’లోని విక్కీ కౌశల్‌ని కాదు నేను’ లాంటి సరదా సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 19న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని