నా కోసమే సృష్టించిన పాత్ర ఇది..

వెండితెరపై తన గ్లామరస్‌ పాత్రలతో, ప్రత్యేక గీతాలతో కుర్రకారుల్ని ఊర్రూతలూగిస్తుంటుంది సన్నీలియోనీ. ఇప్పుడామె.. ప్రియమణితో కలిసి నటిస్తున్న తమిళ చిత్రం ‘కొటేషన్‌ గ్యాంగ్‌’. వివేక్‌ తెరకెక్కిస్తున్నారు.

Published : 29 Jun 2024 01:02 IST

వెండితెరపై తన గ్లామరస్‌ పాత్రలతో, ప్రత్యేక గీతాలతో కుర్రకారుల్ని ఊర్రూతలూగిస్తుంటుంది సన్నీలియోనీ. ఇప్పుడామె.. ప్రియమణితో కలిసి నటిస్తున్న తమిళ చిత్రం ‘కొటేషన్‌ గ్యాంగ్‌’. వివేక్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో సన్నీ, ప్రియమణి మునుపెన్నడూ చూడని విధంగా రా అండ్‌ రస్టిక్‌ లుక్‌లో కనిపిస్తూ, వారి యాక్షన్‌ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా సన్నీ మాట్లాడుతూ.. ‘‘చాలా మంది దర్శకనిర్మాతలు గొప్ప గొప్ప కథలతో నా దగ్గరికి వస్తుంటారు. ‘ఈ పాత్ర మీ ఇమేజ్‌ని మారుస్తుంది’ అంటూ చెప్పినవాళ్లూ ఎక్కువే. ఇది విన్న ప్రతిసారి నేను చాలా సంతోషిస్తుంటాను. ఎందుకంటే వారు తమ సినిమాని, కథను నమ్ముతున్నారు. కానీ.. ఎంతో ప్రత్యేకంగా నా కోసమే ఈ పాత్రను, కథను సృష్టించినందుకు ధన్యవాదాలు’’ అని చెప్పుకొచ్చింది. జాకీ ష్రాఫ్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని