Double iSmart: నిప్పెట్టిన పటాకే.. డబుల్‌ దిమాకే

‘‘ఇస్మార్ట్‌ శంకరే.. ఏక్‌ దమ్‌ డేంజరే.. ఔర్‌ ఏక్‌ బార్‌ ఆయారే.. బేజారే’’ అంటూ హుషారుగా స్టెప్పేస్తున్నారు రామ్‌ పోతినేని.

Updated : 02 Jul 2024 09:18 IST

‘ఇస్మార్ట్‌ శంకరే.. ఏక్‌ దమ్‌ డేంజరే.. ఔర్‌ ఏక్‌ బార్‌ ఆయారే.. బేజారే’’ అంటూ హుషారుగా స్టెప్పేస్తున్నారు రామ్‌ పోతినేని. ఆయన హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ఇది వీళ్లిద్దరి కలయికలోనే వచ్చి విజయవంతమైన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతోంది. పూరి కనెక్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కావ్య థాపర్‌ కథానాయిక. సంజయ్‌ దత్, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఈ చిత్ర తొలి గీతాన్ని విడుదల చేశారు. ‘‘నిప్పెట్టిన పటాకే.. డబుల్‌ దిమాకే.. బడె బడేంకో హిలాదే.. సోచోరే’’ అంటూ రామ్‌ పాత్రను వర్ణిస్తూ సాగిన ఈ పాటకు మణిశర్మ స్వరాలు సమకూర్చగా.. భాస్కర భట్ల సాహిత్యమందించారు. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. జానీ మాస్టర్‌ నృత్యరీతులు అందించారు. ఈ పాటలో మాస్‌ స్టైలిష్‌ లుక్‌లో రామ్‌ కనిపించిన తీరు.. ఆయన వేసిన హుషారైన స్టెప్పులు ఆకర్షణగా నిలిచాయి. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సామ్‌ కె.నాయుడు, జియాని జియాన్నెలి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని