Vijayakanth: కోలుకున్న విజయకాంత్‌.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌

కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ (Vijayakanth) కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.

Published : 11 Dec 2023 14:06 IST

చెన్నై: కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ (Vijayakanth) గత నెలాఖరున తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని ఎం.ఐ.ఒ.టి ఇంటర్నేషనల్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దాదాపు రెండు వారాల నుంచి చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆస్పత్రి వర్గాలు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశాయి. మరోవైపు డీఎండీకే పార్టీ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈరోజు ఉదయం విజయకాంత్‌ ఇంటికి చేరుకున్నారని తెలిపింది.

Naga Chaitanya: ఆ విషయంలో మా తాతయ్య చెప్పింది నిజమైంది..: నాగచైతన్య

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో కుటుంబ సభ్యులు విజయకాంత్‌ను గత నెలాఖరున ఆస్పత్రిలో చేర్పించారు. డయాబెటిస్ కారణంగా గతంలో ఆయన కుడికాలి మూడు వేళ్లను తొలగించిన విషయం తెలిసిందే. ‘ఇనిక్కుం ఇలామై’తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయకాంత్‌. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించి ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించారు. దాదాపు 20కి పైగా పోలీస్‌ కథల్లోనే ఆయన నటించి మెప్పించారు. కెరీర్‌ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్‌.. ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముళక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’లతో విజయాలు అందుకున్నారు. 100వ చిత్రం ‘కెప్టెన్‌ ప్రభాకర్‌’ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్‌గా పిలుస్తున్నారు. ఇక, విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్‌ కావడంతో ఇక్కడి వారికీ ఆయన సుపరిచితులే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని