Ram Gopal Varma: కమల్‌ స్థానంలో మోహన్‌లాల్‌.. షారుక్‌ ప్లేస్‌లో అజయ్‌ దేవ్‌గణ్‌

తాను గతంలో తెరకెక్కించిన ఓ సినిమాకు సంబంధించి దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. అదే సినిమా అంటే?

Published : 23 Jun 2024 12:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొందరు దర్శకులు తమ సినిమాల్లో హీరోగా ముందుగా ఒకరిని అనుకుంటే.. పలు కారణాల వల్ల చివరకు మరొకరిని ఎంపిక చేసుకుంటుంటారు. రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన ఓ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. మూడు ప్రధాన పాత్రల కోసం తొలుత ఓ ముగ్గురిని తీసుకోవాలని భావించిన ఆయన వేరే వారిని ఎంపిక చేసుకుని, విజయం సాధించారు. ఆ ఆసక్తికర విశేషాలను తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అదే.. గ్యాంగ్‌స్టర్‌ ఫిల్మ్‌ ‘కంపెనీ’ (Company).

‘‘ఆ సినిమాలోని మాలిక్‌ పాత్ర కోసం షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)ను కలిశా. అందులో నటించేందుకు ఆయన ఆసక్తి చూపారు. కానీ, ఆయన హైపర్‌ యాక్టివ్‌గా ఉండడంతో ఆ క్యారెక్టర్‌కు సరిపోరని తర్వాత అనిపించింది. సైలెంట్‌గా ఉంటూ పవర్‌ఫుల్‌గా కనిపించేందుకు అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn) అయితే బాగుంటుందని ఆయన్ను తీసుకున్నా. ముంబయి పోలీస్‌ కమిషనర్‌ రోల్‌కు కమల్‌ హాసన్‌ (Kamal Haasan)ను తీసుకోవాలనుకున్నా. షారుక్‌ విషయంలో ఏం అనుకున్నానో కమల్‌ విషయంలోనూ అంతే. కమల్‌ బాడీ లాంగ్వేజ్‌కు కమిషనర్‌ పాత్ర సరిపోదనిపించింది. ఆ తర్వాత మోహన్‌ లాల్‌ (Mohanlal)ను ఎంపిక చేశా. చంద్రకాంత్‌గా అభిషేక్‌ బచ్చన్‌ (Abhishek Bachchan) సెట్‌ అవుతారని ఫిక్స్‌ అయ్యా. కానీ, ఆ సమయంలో ఆయన కాల్షీట్స్‌ ఖాళీ లేవు. అప్పుడు నాలుగైదు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలా.. అభిషేక్‌ స్థానంలో వివేక్‌ ఒబెరాయ్‌ (Vivek Oberoi) నటించారు’’ అని ఆర్జీవీ వివరించారు.

ఆయనే ‘వైజయంతీ మూవీస్‌’ అని పేరు పెట్టారు

‘సత్య’ (1998)కు సీక్వెల్‌గా రూపొందిందే ‘కంపెనీ’ (2002). దీనికి కొనసాగింపుగా తెరకెక్కిన ‘డి’ (D) సినిమా 2005లో విడుదలైంది. ముంబయి మాఫీయా ఇతివృత్తంతో ఈ సినిమాలు రూపొందాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని