Krishna Vamsi: ‘అన్నం’ ఎప్పుడు వండుతారు?: అభిమాని ప్రశ్నకు డైరెక్టర్‌ సమాధానమేంటంటే

తాను ప్రకటించిన ‘అన్నం’ సినిమాపై ప్రశ్న ఎదురవగా డైరెక్టర్‌ కృష్ణవంశీ స్పందించారు.

Published : 02 Jun 2024 12:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాల మేకింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ (Krishna Vamsi). అప్పుడప్పుడు సోషల్‌ మీడియా ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా అభిమానులతో ముచ్చటిస్తుంటారు. పాత సినిమా జ్ఞాపకాలు నెమరువేసుకుంటూనే కొత్త చిత్రాల కబుర్లు పంచుకుంటుంటారు. తాజా చిట్‌చాట్‌లో ఒకరు.. గతంలో తాను ప్రకటించిన ‘అన్నం’ (Annam Movie) సినిమాని గుర్తుచేయగా కృష్ణవంశీ స్పందించారు. ‘అన్నం ఎప్పుడు వండుతారు?’ అంటూ ట్వీట్‌ చేయగా .. నిర్మాత దొరకగానే అని దర్శకుడు సమాధానమిచ్చారు. ‘కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో కోనసీమ అమ్మాయి.. రాయలసీమ అబ్బాయి లవ్‌స్టోరీ రాయండి’ అంటూ మరొక ఫ్యాన్‌ సూచించగా.. ‘గొప్ప ఆలోచన, కథ మీరే రాయొచ్చుగా. రాసి నాకు ఇవ్వండి’ అని కృష్ణవంశీ రిప్లై ఇచ్చారు.

తాను ‘అన్నం: పరబ్రహ్మ స్వరూపం’ టైటిల్‌తో ఓ సినిమాని తెరకెక్కించనున్నట్టు కృష్ణవంశీ కొన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఫుడ్‌ మాఫియా ఇతివృత్తంగా ఆ సినిమా రూపొందించనున్నట్టు తెలిపారు. అందులో టాలీవుడ్‌ స్టార్‌ హీరో ప్రధాన పాత్ర పోషించనున్నారని, ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించే అవకాశాలున్నాయంటూ రూమర్స్‌ వచ్చాయి. కానీ, అధికారికంగా ఎలాంటి అప్‌డేట్స్‌ లేవు. ఈ క్రమంలోనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు సదరు అభిమాని.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని