Vijay: విజయ్‌తో సినిమా కష్టమే..: వెట్రిమారన్‌

విజయ్‌ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్‌ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు.

Updated : 24 Apr 2024 14:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘విడుతలై పార్ట్‌ 1’తో గతేడాది ఘన విజయాన్ని అందుకున్నారు కోలీవుడ్‌ దర్శకుడు వెట్రిమారన్‌ (Vetri Maaran). ఆ సినిమా సీక్వెల్‌ పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. స్టార్‌ హీరో విజయ్‌ (Vijay)తో ఆయన ప్రాజెక్ట్‌ చేయనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలో దీనిపై స్పందిస్తూ.. విజయ్‌తో సినిమా కష్టమేనన్నారు. ‘‘చాలా రోజుల క్రితం ఆయనకు నేనొక కథ చెప్పా. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఇప్పట్లో ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందని అనుకోవడం లేదు. ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో తెలియజేశా. వదంతులు మాత్రం ఆగడం లేదు’’ అని బదులిచ్చారు.

విజయ్‌ ప్రస్తుతం ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ కోసం వర్క్ చేస్తున్నారు. తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి కథానాయిక. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ సినిమా పూర్తయ్యాక తాను ఇంకో సినిమా మాత్రమే చేస్తానని.. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెడతానని ఇటీవల విజయ్‌ ప్రకటించారు.

‘గిల్లీ’ రీ రిలీజ్‌..

విజయ్‌ (Vijay) హీరోగా ధరణి దర్శకత్వం వహించిన చిత్రం ‘గిల్లీ’ (Ghilli). ‘ఒక్కడు’ రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించారు. అప్పట్లో ఇది ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు అయిన సందర్భంగా ఇటీవల చిత్రబృందం దీనిని రీ రిలీజ్‌ చేసింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనపై దర్శకుడు ధరణి ఆనందం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని