Captain Miller: ఇంటర్నేషనల్‌ అవార్డు సొంతం చేసుకున్న ధనుష్‌ చిత్రం

ధనుష్‌ హీరోగా నటించిన ‘కెప్టెన్‌ మిల్లర్‌’ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.

Published : 04 Jul 2024 15:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ధనుష్‌ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కించిన సినిమా ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో ధనుష్‌ నటనకు విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ సినిమా ఇంటర్నేషనల్‌ అవార్డును గెలుచుకుంది. ఈవిషయాన్ని తెలుపుతూ నిర్మాణసంస్థ పోస్ట్‌ పెట్టింది. లండన్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2024లో ఉత్తమ విదేశీ చిత్రంగా ‘కెప్టెన్‌ మిల్లర్‌’ అవార్డు గెలుచుకుంది (Best Foreign Language Film). పలు హాలీవుడ్‌ చిత్రాలతో పోటీపడి ధనుష్‌ సినిమా విజేతగా నిలిచింది. దీన్ని ఆదరించిన వారందరికీ చిత్రబృందం ధన్యవాదాలు తెలిపింది. ఇక ఇదే విభాగంలో భూమి పెడ్నేకర్‌ కీలక పాత్రలో నటించిన ‘భక్షక్‌’ కూడా నామినేషన్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

శరవేగంగా ‘విశ్వంభర’.. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇదే!

ధనుష్‌ (Dhanush) సరసన ప్రియాంకమోహన్‌ నటించిన ‘కెప్టెన్‌ మిల్లర్‌’ రూ.100 కోట్లు వసూలు చేసి ఈ హీరో కెరీర్‌లో హిట్‌ లిస్ట్‌లో చేరింది. ఇందులో ధనుష్‌ భిన్న అవతారాల్లో కనిపించారు. ఆయన చేసిన పోరాట ఘట్టాలు, నటన, పండించిన భావోద్వేగాలు మనసుల్ని హత్తుకున్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో విజువల్స్‌, సంగీతం ప్రేక్షకుల్ని మరింతగా ప్రభావితం చేశాయి. ప్రస్తుతం ధనుష్‌ తన 50వ చిత్రం ‘రాయన్‌’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. జులై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని