Janhvi kapoor: జాన్వీ స్థానంలో త్రిప్తి డిమ్రి .. హిట్‌ మూవీ సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌

జాన్వీ కపూర్‌ నటించిన తొలి చిత్రం ‘ధడక్‌’కు సీక్వెల్‌ను ప్రకటించారు. ఇందులో తారాగణాన్ని మార్చుతున్నట్లు తెలిపారు.

Published : 27 May 2024 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించిన తొలి చిత్రం ‘ధడక్‌’ (Dhadak). శశాంక్‌ దర్శకత్వంలో పూర్తిస్థాయి ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకువచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ హిట్ మూవీకి సీక్వెల్‌ను ప్రకటించారు మేకర్స్‌. మొదటి పార్ట్‌లో చేసిన హీరోహీరోయిన్లను మారుస్తున్నట్లు తెలిపారు.

‘ధడక్‌’లో హీరోగా ఇషాన్‌ ఖట్టర్‌ నటించగా హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ అలరించారు. ఇప్పుడు ‘ధడక్‌2’లో (Dhadak 2) జాన్వీ స్థానంలో త్రిప్తి డిమ్రి (Triptii Dimri), ఇషాన్‌కు బదులు సిద్ధాంత్‌ చతుర్వేదిని తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాత కరణ్‌ జోహార్‌ పోస్ట్‌ పెట్టగా.. జాన్వీ దాన్ని వెంటనే లైక్ చేశారు. ఈ సీక్వెల్‌కు షాజియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక జాన్వీకి ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం. ఈ సినిమా ప్రమోషన్స్‌లోనే శ్రీదేవి మరణించారు. ఆ బాధను మర్చిపోవడం కోసం జాన్వీ ఈ ప్రమోషన్స్‌లో ఎక్కువగా పాల్గొన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కారణంగానే ఆమె ఈ సీక్వెల్‌ను చేయలేకపోతున్నట్లు సమాచారం.

అతి వేషాలు వద్దు..నోరు మూసుకో అని శాస్త్రి గారు కోప్పడ్డారు: రాజమౌళి

‘ధడక్‌’ కథేంటంటే..

హోటల్‌ నడుపుతూ జీవనం సాగించుకునే ఓ వ్యక్తి కుమారుడు మధుకర్‌ (ఇషాన్‌ ఖట్టర్‌). ఉదయ్‌పుర్‌లో ఉండే అగ్రవర్ణానికి చెందిన రతన్‌ సింగ్‌ కుమార్తె పార్థవి (జాన్వీ కపూర్)ను ప్రేమిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రతన్‌సింగ్ ఇద్దరినీ విడదీసి మధుకర్‌ను పోలీసులకు అప్పగిస్తాడు. పోలీస్‌స్టేషన్‌ నుంచి తప్పించుకున్న మధుకర్‌.. పార్థవిని తీసుకుని ముంబయి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఇద్దరూ కోల్‌కతా పారిపోతారు. చిన్న ఉద్యోగం చేస్తూ జీవిస్తుంటారు. వాళ్లకు బాబు పుట్టిన తర్వాత పార్థవి కుటుంబం వారి జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత వారి కథ ఎటువంటి మలుపులు తిరిగింది? చివరివరకు పార్థవి, మధులు కలిసే ఉన్నారా? అనేది మిగతా కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని