Deepika Padukone: సుదీర్ఘంగా మాట్లాడిన ప్రభాస్‌.. ఆటపట్టించిన దీపికా పదుకొణె

‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడిన ప్రభాస్‌పై దీపికా పదుకొణె ఫన్నీ కామెంట్స్‌ చేశారు. 

Published : 20 Jun 2024 12:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెరపై పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో ప్రపంచవ్యాప్త సినీ అభిమానుల్ని అలరించే ప్రభాస్‌ (Prabhas).. తెర వెనుక చాలా తక్కువగా మాట్లాడతారనే సంగతి తెలిసిందే. తన సినిమా వేడుకల్లోనైనా ఆయన ఎక్కువగా ప్రసంగించరు. దానికి భిన్నంగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ విషయంలోనే దీపికా పదుకొణె (Deepika Padukone) ఆయన్ను ఆటపట్టించారు. ఆ మూమెంట్‌ను సెలబ్రేట్‌ చేసుకోవాలని ఫన్నీ కామెంట్స్‌ చేశారు.

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ‘కల్కి’ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ముంబయిలో బుధవారం సాయంత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ప్రభాస్‌, దీపికాతోపాటు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, నిర్మాతలు అశ్వనీదత్‌, స్వప్న దత్‌, ప్రియాంక దత్‌ హాజరయ్యారు. హోస్ట్‌గా వ్యవహరించిన రానా.. నటులందరికీ కొన్ని ప్రశ్నలు వేశారు. అమితాబ్‌, కమల్‌తో కలిసి నటించడంపై ప్రభాస్‌ ఎక్కువ సేపు మాట్లాడారు. దాన్ని ఉద్దేశిస్తూ హీరోయిన్‌ నవ్వులు పూయించారు. ప్రభాస్ ఇంటి నుంచి అందరికీ ఆహారం వచ్చేదని, అది తినే తాను అలా మారానని సరదా వ్యాఖ్యలు చేశారు. నాగ్‌ అశ్విన్‌ విజన్‌ ఉన్న దర్శకుడని కొనియాడారు.

ప్రభాస్‌తోపాటు అమితాబ్‌, కమల్‌ చెప్పిన విశేషాల కోసం క్లిక్‌ చేయండి..

మరోవైపు, స్పీచ్‌ పూర్తయిన అనంతరం దీపికా వేదికపైనుంచి కిందికి వస్తుండగా.. ప్రభాస్‌ ఆమె చేయి పట్టుకుని సాయం చేశారు. దీన్ని చూసిన అమితాబ్‌.. ప్రభాస్‌ను పట్టుకున్నారు. సంబంధిత దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీపికా ప్రెగ్నెంట్‌ కాబట్టి ప్రభాస్‌ ఆమెకు హెల్ప్‌ చేశారంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు.

కల్కి కథ ఏంటో చెప్పేసిన నాగ్‌ అశ్విన్‌.. ఆ మూడు ప్రపంచాలు ఇవే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని