Savitri: ఆయన సలహాను పట్టించుకోని సావిత్రి

ప్రముఖ నటి సావిత్రి (Savitri) దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘చిన్నారి పాపలు’. దీనికి ఎలాగైనా ప్రముఖ రచయిత డి.వి.నరసరాజుతో మాటలు రాయించాలని ఆవిడ ప్రయత్నించారు.

Published : 14 May 2024 12:32 IST

ప్రముఖ నటి సావిత్రి (Savitri) దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘చిన్నారి పాపలు’. దీనికి ఎలాగైనా ప్రముఖ రచయిత డి.వి.నరసరాజుతో మాటలు రాయించాలని ఆవిడ ప్రయత్నించారు. ఆ చిత్ర నిర్మాణంలో చాలామందికి వాటాలున్నాయని తెలుసుకున్న నరసరాజు ఆ చిత్రానికి పనిచేయడానికి నిరాకరించారట. అంతేకాదు - పదిమందిని వెంటబెట్టుకుని చిత్ర నిర్మాణం జోలికి పోవద్దని సావిత్రికి సలహా ఇచ్చారట. భాగస్వామ్యాలు తలనొప్పులు తెచ్చిపెడతాయనీ సావిత్రికి నరసరాజు ఎంతగానో బోధ పరచారట. కానీ, ఆవిడ వినకుండా వాటాదారులను నమ్ముకుని చిత్రనిర్మాణంలోకి దిగిపోయారు. కొంతభాగం పూర్తయిన తర్వాత సావిత్రికి తత్వం బోధపడింది.

ఓ సారి నరసరాజు ఎదురైనప్పుడు ‘మీరు ఊహించిన ఇబ్బందులన్నీ నన్ను చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి’ అంటూ భాగ స్వాముల అలకలు, అభ్యంతరాల గురించి చెప్పుకొన్నారట. చివరకు ‘చిన్నారి పాపలు’ చిత్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను సైతం తలకెత్తుకోవాల్సిరావడంతో సావిత్రి సొంత ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందట. ఆ తర్వాత కూడా చిత్ర నిర్మాణాలు ఆవిడకు కలిసి రాలేదు. తెలుగులో ‘వింత సంసారం’, ‘మూగమనసులు’ తమిళ వెర్షన్‌ ‘ప్రాప్తం’ సావిత్రిని ఇబ్బంది పెట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని