Custody: కస్టడీ కహానీ

నాగచైతన్య కథానాయకుడిగా... శ్రీనివాసా సిల్వర్‌స్క్రీన్‌ పతాకంపై రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘కస్టడీ’. కృతిశెట్టి కథానాయిక.

Updated : 02 Jan 2023 06:50 IST

నాగచైతన్య (Naga Chaitanya) కథానాయకుడిగా... శ్రీనివాసా సిల్వర్‌స్క్రీన్‌ పతాకంపై రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ (Custody). కృతిశెట్టి కథానాయిక. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. అరవింద్‌ స్వామి, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ చిత్రబృందం ఆదివారం ఓ ప్రత్యేకమైన వీడియోని విడుదల చేసింది. అందులో నాగచైతన్య గాఢతతో కూడిన మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. యాక్షన్‌ అంశాలకి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్న చిత్రం అని స్పష్టమవుతోంది. పోలీస్‌ కస్టడీ నేపథ్యంలో సాగే ఈ కథలో నాగచైతన్య... శివ అనే యువకుడిగా కనిపిస్తారు. పోలీస్‌ పాత్రలోనే ఆయన సందడి చేయనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో సంపత్‌రాజ్‌, శరత్‌కుమార్‌, ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్‌, ప్రేమి విశ్వనాథ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఎస్‌.ఆర్‌.కదిర్‌, కూర్పు: వెంకట్‌ రాజన్‌, సంభాషణలు: అబ్బూరి రవి, ప్రొడక్షన్‌ డిజైన్‌: రాజీవ్‌, సంగీతం: ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని