CSI Sanathan: రెండు ఓటీటీల్లో ఆది ‘CSI సనాతన్‌’ సందడి.. ఎక్కడంటే?

ఆది సాయికుమార్‌ హీరోగా తెరకెక్కిన క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా ‘సి. ఎస్‌. ఐ. సనాతన్‌’. ఈ చిత్రం రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Published : 10 May 2023 17:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జయాపజయాలతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేసే హీరో.. ఆది సాయికుమార్‌ (Aadi Saikumar). గతేడాది ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన ఈ సంవత్సరం ఇప్పటికే ‘సి. ఎస్‌. ఐ. సనాతన్‌’ (CSI Sanatan) చిత్రంతో ఆకట్టుకున్నారు. థియేటర్లలో మార్చి 10న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం రెండు ఓటీటీల్లో (ott) విడుదలై, సందడి చేస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (amazon prime video), ఆహా (aha) యాప్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో దర్శకుడు శివశంకర్‌ దేవ్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా ఆది కనిపించి, మెప్పించారు. ఆయన సరసన మిషా నారంగ్‌ నటించింది. నందిని రాయ్‌, అలీ రెజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం మరికొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు ఆది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని