Cobra: ‘అపరిచితుడి’ని మించిన నట విశ్వరూపం.. విక్రమ్‌ ‘కోబ్రా’ ట్రైలర్‌ ఇదిగో!

విక్రమ్‌ నటించిన ‘కోబ్రా’ సినిమా తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. విక్రమ్‌ పలు విభిన్న లుక్స్‌లో కనిపించి, ఆకట్టుకున్నారు.

Updated : 26 Aug 2022 18:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అపరిచితుడు’ చిత్రంలో మూడు విభిన్న పాత్రలతో సినీ అభిమానులు మనసు దోచిన నటుడు చియాన్‌ విక్రమ్‌ (Vikram). ఇప్పుడాయన అంతకుమించి తన నట విశ్వరూపం చూపించేందుకు సిద్ధమయ్యారు. ‘కోబ్రా’ (Cobra) సినిమాలో విక్రమ్‌ ఏడు విభిన్న గెటప్పుల్లో కనిపించనున్నారు. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ నెల 31 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం తమిళ ట్రైలర్‌ విడుదల కాగా తాజాగా తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. విలన్‌ గ్యాంగ్ కథానాయకుడిని హింసించే సన్నివేశంతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. విక్రమ్‌ లుక్స్‌ని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అంతగా వైవిధ్యం ప్రదర్శించారు.

ఈ సినిమాలో విక్రమ్‌.. గణిత శాస్త్రవేత్తగా నటించారు. లెక్కల్లో మేధావి అయిన విక్రమ్‌ విభిన్న రూపాల్లోకి ఎందుకు మారాల్సి వచ్చింది? ఆయన్ను బంధించేందుకు కారణమేంటి?.. తదితర ప్రశ్నలు ట్రైలర్‌ చూస్తే ఉత్పన్నమవుతాయి, ఈ దృశ్యాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, కె.ఎస్‌. రవికుమార్‌, క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎ. ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని