Kalki 2898 AD: ‘కల్కి’ బ్లాక్‌ బస్టర్‌ టాక్‌.. నారా లోకేశ్‌ పోస్ట్‌..

‘కల్కి’పై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Updated : 27 Jun 2024 13:35 IST

ఇంటర్నెట్ డెస్క్: నేడు విడుదలైన ‘కల్కి’  (Kalki 2898 AD) సినిమా బ్లాక్‌బస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్‌ సినిమా హిట్ కావడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

తాజాగా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ‘కల్కి’ టీమ్‌ను అభినందిస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. సినిమాకు వస్తోన్న అద్భుతమైన రివ్యూలు వినడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభాస్‌ (Prabhas), అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణెలకు (Deepika Padukone) అభినందనలు తెలిపారు. గొప్ప సినిమాను తెరకెక్కించారంటూ నాగ్‌ అశ్విన్‌కు ధన్యవాదాలు చెప్పారు. తెలుగు సినిమాను గ్లోబల్‌ స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేశారంటూ నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు.

రివ్యూ: ‘కల్కి 2898 ఏడీ’.. ప్రభాస్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ఎలా ఉంది?

  • అంతర్జాతీయ స్థాయి చిత్రం. పురాణాలకు సైన్స్‌ను ముడిపెట్టి తీసిన మాస్‌ ఇండియన్ ఫిల్మ్‌.. తెలుగు ల్యాండ్‌ నుంచి చూస్తారా? అయితే ‘కల్కి 2898 ఏడీ’ని చూడండి. నాగ్ అశ్విన్‌, ప్రభాస్‌ అన్న, వైజయంతీ మూవీస్‌తో పాటు చిత్రబృందం అందరికీ శుభాకాంక్షలు. ఎంతో గర్వంగా ఉంది - నాని
  • నలుమూలల నుంచి బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వినిపిస్తోంది. టీమ్‌కు శుభాకాంక్షలు. నాగ్‌ అశ్విన్‌ విజన్‌కు హ్యాట్సాఫ్‌. నిర్మాత దూరదృష్టి, అంకితభావం ఈ పురాణకథకు ప్రాణం పోశాయి. భారతీయ సినీ రంగంలో ‘కల్కి’ ఓ మైలురాయి. - మంచు మనోజ్‌
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు