Kalki: తెలుగు సినిమా అనుకుంటే.. వరల్డ్ సినిమాను తీశారు: బ్రహ్మాజీ

నాగ్ అశ్విన్‌పై తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు నటుడు బ్రహ్మాజీ. అభిషేక్‌ బచ్చన్ కూడా ‘కల్కి’ను ప్రశంసించారు.

Published : 01 Jul 2024 19:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు ఈ చిత్రబృందాన్ని అభినందించగా తాజాగా మరికొందరు ఎక్స్‌లో పోస్ట్‌లు పెట్టారు. ‘వావ్‌’ అంటూ బాలీవుడ్‌ స్టార్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ ‘కల్కి’ని ప్రశంసించారు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నటుడు బ్రహ్మాజీ తనదైన శైలిలో నాగఅశ్విన్‌ను పొగిడారు. ఇటీవల నాగ్ అశ్విన్‌ చెప్పుల ఫొటో వైరలైన సంగతి తెలిసిందే. ఆ చెప్పులు తనకు ఇవ్వాలని బ్రహ్మాజీ కోరారు. ఇక ఈ పోస్ట్‌లకు నిర్మాణ సంస్థ రిప్లైలు పెడుతోంది.

రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిక

‘తెలుగు సినిమా అనుకుంటే.. వరల్డ్ సినిమాను తీశారు. నాగ్ అశ్విన్‌ గారు అరిగిపోయిన మీ చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకుంటాను. థ్యాంక్యూ ప్రియాంక దత్‌, స్వప్నదత్‌. మీ రిస్కులే మీకు శ్రీరామరక్ష’ - బ్రహ్మాజీ

‘నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ సినిమాల లిస్ట్‌లో ‘కల్కి’ చేరింది. ఇది హలీవుడ్‌ ‘స్టార్‌వార్‌’కు భారత్‌ సమాధానం. ఇంత గొప్ప సినిమాను చూడడం ఆనందంగా ఉంది. నాగ్ అశ్విన్‌ దర్శకత్వం ఆశ్చర్యపరిచేలా ఉంది. ప్రభాస్ అన్న సూపర్‌’ - సందీప్‌ కిషన్‌

‘నాగ్‌ అశ్విన్ మీరు అన్ని ప్రశంసలకు అర్హులు. అద్భుతమైన కలలు కన్నందుకు, వాటికి జీవం పోస్తూ కొత్త ప్రపంచాన్ని సృష్టించినందుకు మీకు ధన్యవాదాలు. ‘కల్కి’ విజువల్‌ వండర్‌. అమితాబ్ బచ్చన్‌, ప్రభాస్‌ పర్‌ఫెక్ట్‌గా సరిపోయారు. చిత్రబృందానికి నా అభినందనలు’ - సుధీర్‌బాబు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు