Brahmaji: అందుకే యంగ్‌గా ఉన్నా

‘‘నాకెప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ ఉండటమే ఇష్టం. ఎవరి గురించి చెడుగా ఆలోచించను. ఈ సానుకూల దృక్పథమే నా రూపంలో ప్రతిబింబిస్తుంటుంది.

Updated : 28 Jul 2023 14:15 IST

‘‘నాకెప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ ఉండటమే ఇష్టం. ఎవరి గురించి చెడుగా ఆలోచించను. ఈ సానుకూల దృక్పథమే నా రూపంలో ప్రతిబింబిస్తుంటుంది. అందుకే నేనిప్పటికీ యంగ్‌గా కనిపిస్తున్నా. కుళ్లుతో ఉంటే ఇలా కనిపించలేం’’ అన్నారు నటుడు బ్రహ్మాజీ. ఇటీవల ఆయన నటించిన ‘స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌’ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే బ్రహ్మాజీ హైదరాబాద్‌లో గురువారం విలేకర్లతో మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో న్యాయవాది పాత్ర నాది. తను విడాకుల స్పెషలిస్ట్‌. ఉర్దూ, తెలుగు మిక్స్‌ చేసి మాట్లాడుతుంటా. ఈ కథ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పెళ్లి విషయంలో ఎదురయ్యే దోషాల్ని పోగొట్టుకోవడం కోసం స్త్రీలు, పురుషులు చెట్లనో.. జంతువులనో వివాహం చేసుకోవడమన్నది తరచూ చూస్తూనే ఉంటాం. మన దేశంలో ఇప్పటికీ ఈ ఆచారం కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి నేపథ్యంలోనే ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్ర ట్రైలర్‌ చూసి అల్లు అర్జున్‌ నా దగ్గరకు వచ్చి ప్రశంసించడం ఆనందంగా అనిపించింది’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని