Bandla Ganesh: పవన్‌కల్యాణ్‌ పేరు వాడుకొని లబ్ధి పొందను: బండ్లగణేశ్‌

సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan)ను ఉద్దేశిస్తూ నిర్మాత, నటుడు బండ్లగణేశ్‌ (Bandla Ganesh) ట్వీట్‌ చేశారు. 

Published : 03 Jul 2023 15:17 IST

హైదరాబాద్‌: గురు పూర్ణిమని పురస్కరించుకుని తన గురువు పవన్‌కల్యాణ్‌ (Pawankalyan)ని ఉద్దేశిస్తూ సినీ నిర్మాత, నటుడు బండ్లగణేశ్‌ (Bandla Ganesh) ట్వీట్‌ చేశారు. పవన్‌ కలలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాకుండా, ఆయన కీర్తి, పేరుని వాడుకొని లబ్ధి పొందే ప్రయత్నం చేయనని చెప్పారు.

‘‘గురు పూర్ణిమ సందర్భంగా మా గురువుకి శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. కృషితో మీరు అనుకున్నవన్నీ సాధించాలి. మీ స్థాయి, స్థానం తెలిసిన వాడిగా చెబుతున్నా. ఏవిధంగానూ మీ కీర్తి వాడుకుని లబ్ధి పొందను. వీలైతే మీకు సాయంగా ఉంటా. లేకపోతే దూరంగా ఉంటా. అంతేకానీ, మీ పేరు ఉపయోగించి లబ్ధి పొందే ప్రయత్నం చేయను. నా ఆశ ఒకటే.. మీ ఆశయం నెరవేరాలి. నిస్వార్థమైన మీ మనసులాగే మీరూ పది కాలాలపాటు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా’’ అని బండ్ల గణేశ్‌ ట్వీట్‌ చేశారు. దీనికి పవన్‌కల్యాణ్‌ను ట్యాగ్‌ చేశారు. ఇక, బండ్ల గణేశ్‌కు పవన్‌కల్యాణ్‌ అంటే ఎంతో ఇష్టమనే విషయం తెలిసిందే. పవన్‌పై తనకున్న ఇష్టాన్ని చాటి చెబుతూ గణేశ్‌ తరచూ ట్వీట్స్‌ చేస్తుంటారు. పవన్‌ నటించిన ‘తీన్‌మార్‌’ ,‘గబ్బర్‌సింగ్‌’ చిత్రాలకు గణేశ్‌ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని