Vijay: ‘గోట్‌’కి ‘అవతార్‌’ నిపుణుల వీఎఫ్‌ఎక్స్‌

అగ్ర కథానాయకుడు విజయ్‌ హీరోగా భారీ బడ్జెట్‌తో, అత్యంత భారీ అంచనాల మధ్య ముస్తాబవుతున్న చిత్రం ‘గోట్‌’. వెంకట్‌ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ చిత్రానికి మరో ఆసక్తికర విషయం తోడైంది.

Updated : 17 May 2024 01:58 IST

గ్ర కథానాయకుడు విజయ్‌ హీరోగా భారీ బడ్జెట్‌తో, అత్యంత భారీ అంచనాల మధ్య ముస్తాబవుతున్న చిత్రం ‘గోట్‌’. వెంకట్‌ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ చిత్రానికి మరో ఆసక్తికర విషయం తోడైంది. ‘అవతార్‌’, ‘అవెంజర్స్‌’లాంటి హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌కి విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించిన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికీ పని చేయనున్నారు. ఈ విషయాన్ని క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ అర్చనా కళ్పతి సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కి అత్యధిక ప్రాధాన్యం ఉండటం.. హీరో విజయ్‌ కోసం ప్రత్యేకంగా ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’ వాడి పాతికేళ్ల కుర్రాడిగా చూపాల్సి రావడంతో.. అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌లోని స్టూడియో నిపుణులకు ఈ విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు అప్పగించినట్టు సమాచారం. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. యువన్‌ శంకర్‌రాజా బాణీలు సమకూర్చుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని