Ante Sundaraniki: ‘అంటే... సుందరానికీ’ ట్రైలర్‌ వచ్చేసింది.. నవ్వులు తెచ్చేసింది!

చాలాకాలం తర్వాత యువ నటుడు నాని నటించిన కామెడీ ప్రధాన చిత్రం, మలయాళ నటి నజ్రియా నటించిన తొలి తెలుగు సినిమా ‘అంటే సుందరానికీ!’.

Updated : 02 Jun 2022 18:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలాకాలం తర్వాత నాని నటించిన కామెడీ ప్రధాన చిత్రం ‘అంటే... సుందరానికీ!’ (Ante Sundaraniki). వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ ఎంటర్‌టైనర్‌ జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను విశాఖపట్నం వేదికగా గురువారం విడుదల చేసింది. ఈ సినిమాలో ఎంత వినోదం ఉంటుందో ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌ చెప్పకనే చెప్పాయి. ఇప్పుడీ ట్రైలర్‌ అంతకుమించిన వినోదం పంచేలా ఉంది. ఈ ప్రచార చిత్రంలో చూపించిన ప్రతి క్యారెక్టర్‌ నవ్వుల జల్లు కురిపిస్తోంది. ముఖ్యంగా కథానాయకుడి హావభావాలు చక్కిలిగింతలు పెట్టేలా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో సుందర్‌గా నాని కనిపించనున్నారు. మలయాళ నటి నజ్రియా లీల అనే పాత్ర పోషించింది. నరేశ్‌, రోహిణి, హర్షవర్ధన్‌, రాహుల్‌ రామకృష్ణ, సుహాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ సాగర్‌, ఛాయాగ్రహణం: నికేత్‌ బొమ్మి, కూర్పు: రవితేజ గిరిజాల.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని