Allari Naresh: ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి!

ఇటీవలే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అల్లరి నరేశ్‌. ఇప్పుడు ‘బచ్చల మల్లి’గా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సుబ్బు మంగదేవి తెరకెక్కిస్తున్నారు.

Published : 01 Jul 2024 01:39 IST

టీవలే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అల్లరి నరేశ్‌. ఇప్పుడు ‘బచ్చల మల్లి’గా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సుబ్బు మంగదేవి తెరకెక్కిస్తున్నారు. రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్‌ కథానాయిక. రావు రమేశ్, రోహిణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆదివారం అల్లరి నరేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో నరేశ్‌ మాస్‌ రగ్గడ్‌ లుక్‌లో మునుపెన్నడూ చూడని విధంగా కనిపించారు. ఇంటి ముందు భగవద్గీత వినిపిస్తున్న మైక్‌ సెట్‌ను విసిరికొట్టడం.. బార్‌లో శత్రువులపై విరుచుకుపడిన తీరు.. ఈ చిత్రంలో ఆయన పాత్ర ఎంత మాస్‌గా కనిపించనుందో తెలియజేస్తున్నాయి. ‘‘ఏయ్‌ ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి’’ అంటూ ఆఖర్లో నరేశ్‌ చెప్పిన డైలాగ్‌ ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్, ఛాయాగ్రహణం: రిచర్డ్‌ ఎం.నాథన్‌.

అతని కంటి నుంచి తప్పించుకోలేరు! 

ల్లరి నరేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం తన నుంచి ఓ కొత్త కబురు వినిపించింది. ఆయన 63వ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నట్లు ప్రకటించారు. ‘ఫ్యామిలీ డ్రామా’ అనే చిత్రంతో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని మెప్పించిన మెహర్‌ తేజ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘మీరు అతని కంటి నుంచి తప్పించుకోలేరు’’ అంటూ చిత్ర నిర్మాతలు విడుదల చేసిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ ఆసక్తిరేకెత్తించేలా ఉంది. దీన్ని బట్టి ఇదొక వైవిధ్యభరితమైన కథతో రూపొందనున్నట్లు అర్థమవుతోంది. అంతేకాదు దీంట్లో నరేశ్‌ పాత్ర అందర్నీ ఆశ్చర్చపరిచే విధంగా ఉంటుందని తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని