Alia Bhatt: రైటర్‌గా అలియా భట్‌.. ఆమె ఏం రాశారంటే?

నటి అలియా భట్‌ రచయిత్రిగా మారారు. ఆమె రాసిన పుస్తకం ఏంటంటే?

Published : 18 Jun 2024 21:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి అలియా భట్‌ (Alia Bhatt) తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఆమె రచయిత్రిగా మారారు. పిల్లల కోసం తాను రాసిన Ed finds a Home అనే పుస్తకం ఇటీవల విడుదలైందని తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘కొత్త ప్రయాణం మొదలైంది. Ed-a-mamma సిరీస్‌లో భాగంగా ఇంకా చాలా పుస్తకాలు రానున్నాయి. నేను కథలు వింటూ పెరిగా. అలాంటి స్టోరీలు ఈతరం చిన్నారులకు చెప్పాలనే నా కల పుస్తక రూపంలో నెరవేరింది. ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. బుక్‌ రిలీజ్‌కు సంబంధించిన దృశ్యాలను షేర్‌ చేశారు. ప్రముఖ బుక్‌స్టోర్స్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ ఆ పుస్తకాన్ని విక్రయిస్తున్నట్టు తెలిపారు. భూ సంరక్షణ, పెంపుడు జంతువులతో స్నేహం ఈ బొమ్మల పుస్తకంలో ప్రధానాంశాలు.

చిరంజీవికి రాజ్యసభ సీటంటూ ప్రచారం.. సుస్మిత ఏమన్నారంటే?

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు వ్యాపార రంగంలోకి ప్రవేశించారు అలియా. కొన్నాళ్లపాటు ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ వచ్చిన ఆమె.. 2022లో తాను గర్భిణిగా ఉన్న సమయంలోనే చిన్నారుల కోసం Ed-a-mamma పేరిట దుస్తుల విక్రయం మొదలుపెట్టారు. ఇప్పుడు రైటర్‌గా పరిచయమయ్యారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరోయిన్‌.. హీరో రణ్‌బీర్‌ కపూర్‌ని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతుల ముద్దుల తనయ పేరు రాహా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని