Nagarjuna: ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున

గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు.

Published : 24 Jun 2024 13:48 IST

ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించడం నాగార్జున గొప్పతనం. ఎన్నో విభిన్నమైన పాత్రలతో వినోదాన్ని పంచుతున్న ఆయన (Nagarjuna) తాజాగా ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

సినిమాలో సంగీతానికి, సాహిత్యానికి మీరు ఎలాంటి ప్రాముఖ్యతనిస్తారు?

నాగార్జున: సంగీతం కేవలం సినిమాలోనే కాదు.. జీవితంలోనూ ఓ భాగం. మ్యూజిక్‌ను ఆస్వాదించగలిగితే జీవితంలో ఎప్పుడూ ఒంటరితనం దరి చేరదు. సిరివెన్నెల సీతారామశాస్త్రిని చూస్తే అసూయగా అనిపించేది. సాహిత్యాన్ని అంత గొప్పగా ఎలా రాసేవారో అర్థమయ్యేది కాదు. నాకు సంగీతమంటే ఇష్టం. ఖాళీ సమయంలో ఎప్పుడూ మ్యూజిక్‌ వింటుంటాను.

శాస్త్రిగారితో మొదటిసారి ఎప్పుడు వర్క్‌ చేశారు?

నాగార్జున: నేను, శాస్త్రిగారు ఒకే సమయంలో ఇండస్ట్రీకి వచ్చాం. నన్ను హీరో అని పిలిచేవారు. ‘సంకీర్తన’లో ‘వే వేలా వర్ణాల’ పాటను ఆయన రాశారు. అది నా రెండో సినిమా.

ఆయన్ని మొదటిసారి ఎప్పుడు కలిశారు?

నాగార్జున: మొదటిసారి ఎప్పుడు కలిశానో గుర్తులేదు. కానీ, ‘శివ’ సమయంలో క్లోజ్‌ అయ్యాం. ఆ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఆ చిత్రంలోని పాటల కోసం ఆయనతో మాట్లాడాను.

‘కల్కి’లో ప్రభాస్‌, కమల్‌హాసన్‌ పాత్రలకు పురాణాల రిఫరెన్స్‌ అదేనా?

శాస్త్రిగారిలో మీకు నచ్చే విషయం ఏంటి?

నాగార్జున: ఆయన మాట్లాడుతుంటే చిన్న పిల్లాడు మాట్లాడుతున్నట్లు ఉంటుంది. అందరికీ అర్థమయ్యేలా పాటలు రాసేవారు. ‘శివ’లో ‘బోటనీ క్లాసు ఉంది’ పాట చాలామందికి ఫేవరెట్‌. దాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు. సులువైన పదాలతో రాసినా.. లోతైన అర్థం ఉంటుంది. ‘శివ’లోనే ‘సరసాలు చాలు శ్రీవారు’ అని మరో పాట రాశారు. భార్యాభర్తలంతా దానికి కనెక్ట్‌ అవుతారు. ఆయనకు ప్రపంచంలో జరిగే చాలా విషయాలపై అవగాహన ఉండేది. అన్నిటి గురించి తెలుసు కాబట్టే అంత అద్భుతంగా రాసేవారు.

‘అంతం’లోని ‘నీ నవ్వు చెప్పింది నాతో’ పాటకు సంబంధించిన అనుభవాలు గుర్తున్నాయా?

నాగార్జున: అనుభవాలంటూ ప్రత్యేకంగా లేవు. దర్శకులతో, రచయితలతో నేను పర్సనల్‌గా పాటల గురించి మాట్లాడతాను. ‘క్రిమినల్‌’లోని ‘తెలుసా మనసా’ పాటను దగ్గర కూర్చొని రాయించుకున్నా. ఆ సినిమా దర్శకుడికి తెలుగు రాదు. అందుకే ఆ పాట సందర్భాన్ని శాస్త్రి గారికి (sirivennela sitarama sastry) నేను వివరించాను. ఆయనెప్పుడు రాత్రి పూటే రాసేవారు. దీంతో మూడు రోజులు ఆయనతో ఉండి ఆ పాట రాయించుకున్నా. ఇవే లిరిక్స్‌ను హిందీలో రాయాలని కొందరు ప్రయత్నించారు కానీ, సాధ్యపడలేదు.

‘నిన్నే పెళ్లాడతా’లో ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ విశేషాలు పంచుకుంటారా?

నాగార్జున: బ్యూటీఫుల్‌ సాంగ్. లిరిక్స్‌ చాలా సింపుల్‌గా ఉంటాయి. ఇదే సినిమాలో ‘కన్నుల్లో నీ రూపమే’ నాకు ఇష్టమైన పాట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని