chiranjeevi: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: చిరంజీవి

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని టాలీవుడ్‌ అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు.

Published : 28 Jun 2024 00:19 IST

హైదరాబాద్: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని టాలీవుడ్‌ అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు ఆకర్షితులై ఎంతో మంది యువత తమ జీవితాలను నాశం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్‌ టీమ్‌కు సహకరిస్తూ తన వంతు బాధ్యతగా ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా చిరంజీవి ప్రత్యేక వీడియో విడుదల చేశారు. రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా.. వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతారని, బాధితులను శిక్షించడం కన్నా రక్షించడమే ప్రధానంగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పనిచేస్తుందని వివరించారు. డ్రగ్స్ రహిత తెలంగాణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని