‘యమలీల’కు అలీని తీసుకోవడానికి కారణమదే..!

ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన వినోదాత్మక కుటుంబకథా చిత్రం ‘యమలీల’. 1994లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టి హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో హాస్యనటుడు అలీని కథానాయకుడిగా ఎంపిక చేసుకోవడానికి గల కారణాన్ని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి వెల్లడించారు...

Updated : 24 Sep 2020 13:36 IST

హైదరాబాద్‌: ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన వినోదాత్మక కుటుంబకథా చిత్రం ‘యమలీల’. 1994లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టి హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో హాస్యనటుడు అలీని కథానాయకుడిగా ఎంపిక చేసుకోవడానికి గల కారణాన్ని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి వెల్లడించారు. తాజాగా ఆయన అలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తన మాతృమూర్తిని దృష్టిలో ఉంచుకునే ‘యమలీల’ చిత్రంలోని అమ్మపాటను చిత్రీకరించానని కృష్ణారెడ్డి తెలిపారు. ‘యమలీల’ చిత్రంలో నటిస్తామని కొంతమంది అగ్రహీరోలు తనని సంప్రదించారని.. కానీ హీరో విషయంలో తాను ఎంతో స్పష్టతతో అలీని ఎంచుకున్నానని వివరించారు. అంతేకాకుండా తాను హీరో అవుదామనే ఇండస్ట్రీకి వచ్చానని, అవకాశాల కోసం జంధ్యాల, దాసరి నారాయణరావు లాంటి ఎంతో మంది దర్శకులను కలిశానని, అవకాశాలు రావడం చాలా కష్టమని అర్థమయ్యాక అచ్చిరెడ్డి మాటతో దర్శకత్వంలోకి అడుగుపెట్టానని ఆయన వివరించారు. ఇలా తన జీవితానికి సంబంధించి ఎన్నో సంగతులను ఎస్వీ కృష్ణారెడ్డి సరదాగా పంచుకున్నారు. సెప్టెంబర్‌ 28న ప్రసారం కాబోయే ఆ ‘ఆలీతో సరదాగా’ ఎపిసోడ్‌ ప్రోమో మీకోసం..



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని