7G Brudavan Colony: రీ రిలీజ్‌లోనూ యూత్‌ ఫిదా.. థియేటర్స్‌లో ఫ్యాన్స్‌ సందడి..

సూపర్‌ హిట్‌ చిత్రం ‘7/జీ బృందావన కాలని’ (7G Brindavan Colony) తాజాగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Published : 22 Sep 2023 12:00 IST

హైదరాబాద్‌: 2004లో విడుదలై సంచలనం సృష్టించిన సినిమా ‘7/జీ బృందావన కాలని’ (7G Brindavan Colony). నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు రవికృష్ణ హీరోగా అలరించగా.. సోనియా అగర్వాల్‌ హీరోయిన్‌ పాత్రలో ఆకట్టుకుంది. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 19 ఏళ్ల తర్వాత నేడు 4కే వెర్షన్‌లో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏకంగా 1250 షోలను ప్రదర్శిస్తున్నారు. దీంతో మరోసారి థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు ట్విటర్‌లో వైరల్‌గా మారాయి. 

‘ఏఐ’ మాయ.. ఎన్టీఆర్‌ని తలపించేలా.. ఫొటో వైరల్‌

ఇక త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల రీ రిలీజ్‌ ట్రైలర్‌ లాంఛ్‌ కార్యక్రమంలో నిర్మాత ఎ.ఎం.రత్నం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అక్టోబర్‌లో ఈ సీక్వెల్‌ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనికి కూడా సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించినున్నట్లు చెప్పారు. స్క్రిప్ట్‌ కూడా సిద్ధమైందని.. తప్పకుండా మరోసారి అందరూ కనెక్ట్‌ అవుతారని ఆయన చెప్పారు. ఇక హీరో రవికృష్ణ ఈ సీక్వెల్‌ గురించి మాట్లాడుతూ.. ఇప్పటి పరిస్థితులకనుగుణంగా కథ ఉండనున్నట్లు తెలిపారు. విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నట్లు చెప్పారు. దీంతో మిడిల్ క్లాస్‌ ఫ్యామిలీ ఎమోషన్స్‌, కామెడీ, లవ్‌ ట్రాక్‌లతో కలిసి రానున్న ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని