Viral video: 5-స్టార్‌ హోటల్‌ బాల్కనీలో దుస్తులు ఆరేసిన మహిళ.. వీడియో వైరల్‌

దుబాయ్‌లోని 5-స్టార్‌ హోటల్‌ బాల్కనీలో ఓ మహిళ దుస్తులు ఆరబెడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Updated : 28 Jun 2024 19:08 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: దుబాయ్‌లోని 5-స్టార్‌ రిసార్ట్‌(5-star resort)లో ఓ మహిళ తాము బుక్‌ చేసుకున్న గది బాల్కనీలో దుస్తులు ఆరేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాము ఫ్యామిలీ హాలిడేకు దుబాయ్‌(Dubai)కి వచ్చామని, ఇక్కడి ప్రముఖ రిసార్ట్‌ అట్లాంటిస్‌, ది పామ్‌(Atlantis, The Palm)లో బస చేశామని పల్లవి వెంకటేష్ అనే వ్యక్తి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు.

వీడియోలో తన తల్లి బీచ్ రిసార్ట్‌లోని గది బాల్కనీలో దుస్తులు ఆరబెడుతుండగా  ‘‘ఈ అమ్మలు ఉన్నారే.. పామ్ అట్లాంటిస్‌లోనూ తమ పనులు వదలరు’’ అంటూ ఆ వీడియోకు వ్యాఖ్యను జత చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఆ రిసార్ట్‌ నిర్వహకులు స్పందిస్తూ ‘‘ఇవి అమ్మలందరికీ ఉండే పనులు. మా హోటల్‌లో బస చేయడం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం! మేము ప్రతి బాత్‌రూమ్‌లో దుస్తులు ఆరబెట్టుకోవడానికి ఏర్పాట్లు చేశాం. అక్కడే ఆరబెట్టుకోవచ్చు’’ అని తెలిపారు.

మహిళ చేసిన పనిని కొందరు నెటిజన్లు విమర్శించగా.. మరికొందరు సమర్థించారు.“మన దేశంలో అయితే ఇలా చేయవచ్చు. ఇతర దేశాల్లో ఇలా ప్రవర్తిస్తే అమర్యాదగా భావిస్తారు” అంటూ ఓ నెటిజన్‌ రాసుకొచ్చారు. ‘ఇందులో తప్పేముంది? అని మరో నెటిజన్‌ పేర్కొన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని