JP Nadda: పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితం కాదు: జేపీ నడ్డా

పశ్చిమ బెంగాల్‌లో ఓ జంటను నడిరోడ్డుపై  దారుణంగా కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. దీనిపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు.

Published : 01 Jul 2024 11:54 IST

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో ఓ జంటపై జరిగిన దాడి విషయంలో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) సోమవారం స్పందించారు. రాష్ట్రంలో బహిరంగంగా దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. 

సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా నడ్డా స్పందిస్తూ ‘‘పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఓ అమానవీయ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మతం పేరుతో చేస్తున్న క్రూరత్వానికి ఇది నిదర్శనం. దీనిని వ్యతిరేకించడానికి బదులు తృణమూల్‌ కాంగ్రెస్‌(TMC)కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సమర్థిస్తున్నారు. సందేశ్‌ఖాలీ, ఉత్తర దినాజ్‌పూర్ ఇలా ఏ ప్రాంతాల్లోనూ మహిళలకు భద్రత లేదు. పశ్చిమబెంగాల్‌ మహిళలకు సురక్షితం కాదు’’ అని పేర్కొన్నారు. 

వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంగా పశ్చిమబెంగాల్‌లో ఓ జంటను నడిరోడ్డుపై దారుణంగా చావగొట్టిన వీడియో వైరల్‌గా మారడంతో ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. వీడియోలో వెదురుకర్రతో జంటను ఇష్టానుసారం కొడుతున్న వ్యక్తి ఉత్తర్‌ దినాజ్‌పుర్‌ జిల్లాలోని చోప్రా ప్రాంత టీఎంసీ నేత తాజ్‌ముల్‌ అలియాస్‌ జేసీబీ(Tajmul alias JCB)గా గుర్తించి అరెస్టు చేశారు. సుమోటోగా కేసు నమోదుచేసిన పోలీసులు బాధిత జంటకు రక్షణ కల్పించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు