Tamil Nadu: కల్తీసారా విక్రయాలపై తమిళనాడు ఉక్కుపాదం

ఇటీవల తమిళనాడులో కల్తీసారా బారిన పడి 60 మంది మృత్యువాత పడిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.

Published : 30 Jun 2024 02:55 IST

చెన్నై: ఇటీవల తమిళనాడులో కల్తీసారా బారిన పడి 60 మంది మృత్యువాత పడిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇలాంటి తరహా నేరాలకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపేలా చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. కల్తీ మద్యం తాగి ఎవరైనా చనిపోతే.. తీవ్రతను బట్టి కారకులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించనున్నారు. ఈమేరకు తమిళనాడు ప్రొహిబిషన్ యాక్ట్ -1937కు సవరణలు చేశారు. వీటి ప్రకారం మద్యం తయారీ దారులు, కల్తీ సారా విక్రయిస్తున్నవారిపైనా చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. తక్షణమే ఈ సవరణలు అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కల్తీసారా విక్రయాలను పూర్తిగా నిర్మూలించేందుకే ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని