Deputy Speaker: ఆ పార్టీ ఎంపీకే ‘డిప్యూటీ’ ఇవ్వండి.. టీఎంసీ విజ్ఞప్తి

లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవి అంశంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ భిన్నంగా స్పందించింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపీకి ఆ పదవిని ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సమాచారం.

Updated : 30 Jun 2024 20:34 IST

దిల్లీ: 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా మరోసారి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిప్యూటీ స్పీకర్‌ (Deputy Speaker) ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు.. ఆ పదవిని తమ కూటమి సభ్యుడికే ఇవ్వాలని భాజపా యోచిస్తోంది. మరోవైపు.. విపక్ష కూటమిలో భాగమైన తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) మాత్రం సమాజ్‌వాదీ పార్టీ (SP) ఎంపీకే ఆ సీటు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సంబంధిత వర్గాల సమాచారం.

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అవధేశ్‌ ప్రసాద్‌ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫైజాబాద్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆయన్ను డిప్యూటీ స్పీకర్‌ పదవికి అర్హుడిగా భావించిన టీఎంసీ.. ఆ బాధ్యతలు అప్పగించాలని కేంద్రాన్ని కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

దేశ అత్యున్నత అధికారులుగా..చిన్ననాటి స్నేహితులు

స్పీకర్‌ పదవిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల తర్వాత ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై విజయం సాధించి మరోసారి ఈ పదవికి ఓం బిర్లా ఎన్నికయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని