Singing Chaiwala: ‘సింగింగ్‌’ చాయ్‌వాలా..! పాటలు పాడుతూ.. టీ చేస్తూ..

ఒక చేతిలో చాయ్‌ కలిపే గరిటె.. మరో చేతిలో మైక్‌తో కనిపిస్తున్న ఓ చాయ్‌వాలా.. వినియోగదారులకు టీ రుచి చూపిస్తూనే.. గాన మాధుర్యంతో అలరిస్తున్నారు.

Updated : 05 Jul 2024 19:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిల్‌గేట్స్‌ స్వయంగా తనవద్దకు వచ్చి చాయ్‌ తాగడంతో.. ‘డాలీ చాయ్‌వాలా’ వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో చాయ్‌వాలా వైరల్‌గా మారారు. ఆయనే.. సూరత్‌కు చెందిన ‘సింగింగ్‌ చాయ్‌వాలా (Singing Chaiwala)’ విజయ్‌భాయ్‌ పటేల్‌. ఒక చేతిలో చాయ్‌ కలిపే గరిటె.. మరో చేతిలో మైక్‌తో కనిపిస్తున్న ఆయన.. వినియోగదారులకు టీ రుచి చూపిస్తూనే.. గాన మాధుర్యంతో అలరిస్తున్నారు. ముంబయికి చెందిన ఓ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ దీనికి సంబంధించి పోస్ట్‌ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

తన దుకాణం వద్ద ఒకవైపు చాయ్‌ తయారు చేస్తూనే.. మరోవైపు మైక్‌లో బాలీవుడ్‌ గీతాన్ని పాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ‘‘విజయ్‌భాయ్‌ అనేక సంవత్సరాలుగా చాయ్‌ దుకాణం నడుపుతున్నారు. ఆయన తయారు చేసే టీ చాలా బాగుంటుంది . ఆయన గొంతు అంతకంటే మధురం. చాయ్‌ను ఆస్వాదించేందుకు, శ్రవణానందకరమైన ఆయన పాటలను వినేందుకు ఎక్కడెక్కడినుంచో వినియోగదారులు వస్తుంటారు’’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చారు. నెటిజన్లూ ఆయన గాన నైపుణ్యానికి ఫిదా అయ్యారు. గొంతు బాగుంది.. సూపర్‌ టాలెంట్‌ అంటూ కామెంట్లు పెట్టారు.

30 ఏళ్లుగా ఒక్క చీరా కొనుక్కోలేదు.. సుధామూర్తి ఆసక్తికర సంగతులు

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో అపర కుబేరుడు బిల్‌గేట్స్‌ భారత్‌కు వచ్చిన సందర్భంగా ‘డాలీ చాయ్‌వాలా’ వద్ద టీ రుచిచూసిన విషయం తెలిసిందే. ఆ వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. ఫంకీ డ్రెస్, రంగు రంగుల కళ్లద్దాలు, మెడలో బంగారు గొలుసు, చిత్రమైన హెయిర్‌స్టైల్‌తో లోకల్‌ సెలబ్రిటీగా ఉండే డాలీ.. గేట్స్‌ను కలిసిన తర్వాత గ్లోబల్‌ తారగా మారాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని