Lok Sabha Election Results: సినిమా థియేటర్లలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు.. ఎక్కడో తెలుసా?

Lok Sabha Election Results: లోక్‌సభ ఎన్నికల ఫలితాలను సినిమా థియేటర్లలో ప్రసారం చేయనున్నారట. ఇందుకోసం బుకింగ్స్‌ కూడా తెరిచారు. ఎక్కడో తెలుసా?

Updated : 31 May 2024 17:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల సందడి ముగింపు దశకు చేరుకుంది. శనివారం (జూన్‌ 1) చివరివిడత పోలింగ్‌ జరగనుంది. ఇక దేశ ప్రజల కళ్లన్నీ ఎన్నికల ఫలితాల (Election Results)పైనే..! రేపు ఓటింగ్‌ ముగిసిన వెంటనే మీడియా, సోషల్‌ మీడియాలో ఎగ్జిట్‌ పోల్స్‌ (exit polls) అంచనాలు మార్మోగనున్నాయి. దీంతో జూన్‌ 4 నాటి ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ మరింత పెరుగుతుంది. ఆ రోజున యావత్‌ దేశం టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే ఎన్నికల (Lok Sabha Elections) ఫలితాలు బిగ్‌ స్క్రీన్‌పై కన్పిస్తే..! ఎలా అనుకుంటున్నారా..? మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు (Movie theatres) ఈ ఫలితాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సిద్ధమయ్యాయి.

ముంబయి (Mumbai)లోని ఎస్‌ఎం5 కల్యాణ్‌, సియాన్‌, కంజూర్‌మార్గ్‌లోని మూవీమ్యాక్స్‌ థియేటర్లు, ఠాణెలోని ఎటర్నిటీ మాల్‌, వండర్‌ మాల్‌, నాగ్‌పుర్‌లోని మూవీమ్యాక్స్‌ ఎటర్నిటీ, పుణెలోని మూవీమ్యాక్స్‌ తదితర థియేటర్లు జూన్‌ 4న ఎన్నికల ఫలితాల (Election Results 2024)ను పెద్ద స్క్రీన్‌పై ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పేటీఎం వంటి వేదికల్లో బుకింగ్స్‌ను ప్రారంభించారట.

లెక్కింపు కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే

ఆరు గంటల పాటు ఫలితాలను థియేటర్లలో లైవ్‌ స్ట్రీమ్‌ చేయనున్నారట. ఇందుకోసం టికెట్‌ (Ticket) ధరలు రూ.99 నుంచి మొదలుకొని రూ.300 వరకు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని థియేటర్లలో ఫలితాల ప్రదర్శనకు హౌస్‌ఫుల్‌ అయినట్లు తెలుస్తోంది. టికెట్‌ బుకింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లను కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని